పండగ పూట తీరని వేదన
ఇసుకపల్లి తీరంలో విహారానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు.. బాలిక, బాలుడి మృతి
మరో ఇద్దరు గల్లంతు.. ఆచూకీ కోసం గాలింపు
సురక్షితంగా బయట పడిన ఇంకో ఇద్దరు
అల్లూరు: కనుమ పండగ వేళ ఆ కుటుంబాలను విషాద తరంగం ముంచెత్తింది. సముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. ఈఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు. బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన వీరు అల్లూరు మండల నార్త్‌ఆములూరు పంచాయతీ గోళ్లపాళెం చైల్డ్ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరి బంధువులు అల్లూరు యర్రపగుంటలో ఉండగా సంక్రాంతి పండగ కావడంతో ఇక్కడకు వచ్చారు.
శుక్రవారం మరో నలుగురు స్నేహితులు కె.అభిషేక్(16), జి.సు«దీర్(15), ఈగ చిన్నబయ్య, ఎస్.వెంకటేష్తో కలిసి ఇసుకపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచి్చన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిõÙక్, జి సు«దీర్ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. అభిõÙక్, సు«దీర్ ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి బీచ్‌లో కనుమ పండుగ రోజు సరదాగా గడిపేందుకు వెళ్ళిన ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, మరో ఇద్దరు గల్లంతు కావడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


