నెల్లూరు: ఇసుకపల్లి బీచ్‌లో మరో మృతదేహం లభ్యమైంి నిన్న(శుక్రవారం, జనవరి 16వ తేదీ) ఇసుకపల్లి బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థలు వెళ్లగా వారిలో నలుగురు గల్లంతయ్యారు. నిన్ననే మూడు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం, జనవరి 17వ తేదీ) మరో మృతదేహం లభించింది. ఇప్పటివరకూ మూడు మృతదేహాలు లభించగా, మరో యువకుడి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్‌కు ఆరుగురు యువకులు వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిషేక్, జి సు«దీర్ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. ఈరోజు మరో మృతదేహం లభించింది.


