మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ మార్పు! పియూష్‌ గోయల్‌ ఏమన్నారంటే | Maharashtra chief change speculation: What Piyush Goyal said after BJP's review meet | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ మార్పు! పీయూష్‌ గోయల్‌ ఏమన్నారంటే

Published Wed, Jun 19 2024 12:17 PM | Last Updated on Wed, Jun 19 2024 1:04 PM

maharashtra chief change speculation:What Piyush Goyal said after BJP review meeting

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయింది. సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్న క్రమంలో బీజేపీ మహారాష్ట్రపై ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా,  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులుపై మంగళవారం భేటీ అయ్యారు. 

ఈ భేటీలో పాల్గొన్న పీయూష్‌ గోయల్‌ కొన్ని రోజులుగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర బీజేపీ న్యాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (శివసేన (షిండే వర్గం)-బీజేపీ-ఎన్సీపీ( అజిత్‌ వర్గం) సంకీర్ణం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆచరించే వ్యూహాలపై కోర్‌ కమిటీ భేటీలో చర్చించాం’ అని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహారాష్ట్రతో పేలవ ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ-9, ఎన్సీపీ (అజిత్‌ వర్గం)-1, శివసేన (షిండే వర్గం)-7 సీట్లతో మొత్త 17 స్థానాలకే​ పరిమితమైంది.  2019 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాలకు 41 సీట్లు గెలుచకున్న విషయం తెలిసిందే.  

లోక్‌ సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్‌ తన డిప్యూటీ సీఎం పదివికిఈ రాజీనామా చేయాలని భావించగా.. బీజేపీ అగ్రనేతల సూచన మేరకు వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి బీజేపీ చీఫ్‌ను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్థానంలో రావు సాహెబ్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వ్యాప్తిచెందాయి. 

‘మహాయుతి కూటమి పార్టీలతో కలిసి.. అసెంబ్లీ ఎన్నికల గెలుపు కోసం బ్లూప్రింట్‌ తయారు చేయటంపై చర్చించాం’డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నివిస్‌ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ మార్పుపై పార్టీనేతల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement