సర్వస్వం త్యాగం : అజిత్‌ పవార్‌ చివరి పోస్ట్‌ వైరల్‌ | Sacrificed everything Ajit Pawar last Fb post hours before plane crash going viral | Sakshi
Sakshi News home page

సర్వస్వం త్యాగం : అజిత్‌ పవార్‌ చివరి పోస్ట్‌ వైరల్‌

Jan 28 2026 5:56 PM | Updated on Jan 28 2026 6:22 PM

Sacrificed everything Ajit Pawar last Fb post hours before plane crash going viral

సాక్షి, ముంబై:  మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఎన్‌సీపీనేత అజిత్ పవార్ అకాలమరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.  బుధవారం తెల్లవారుజామున బారామతిలో విమానం ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలడంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. అయితే విమాన ప్రమాదానికి  కొన్ని గంటల ముందు చేసిన దేశభక్తి, త్యాగం అంటూ చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌  పలువురి  చేత కంటతడి పెట్టిస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న అజిత్‌ పవార్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. స్వాతంత్ర్య సమరయోధుడు లాలాలజపతి రాయ్ జయంతి సందర్భంగా తన చివరి ఫేస్‌బుక్ పోస్ట్‌లో  ఆయనకు నివాళులు అర్పించారు.  లజపత్ రాయ్ దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేశారని, ఆయన దేశభక్తి తరతరాలకు స్ఫూర్తి నిస్తుందని పవార్  రాశారు. అలాగే పవార్ మంగళవారం రాత్రి ఎక్స్‌ (గతంలో ట్విటర్)లో సీఎంఓ మహరాష్ట్ర ట్వీట్‌ను రీట్వీట్‌  చేశారు. ఒక ఫోటోతో పాటు క్యాబినెట్ సమావేశం,  కీలక ప్రభుత్వ నిర్ణయాల గురించి చర్చించామని తన చివరి  ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ;

ఇదీ చదవండి: షాకింగ్‌ న్యూస్‌ : అమెజాన్‌లో వేలాది మంది ఉద్యోగులపై వేటు

అజిత్‌ పవార్‌  అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రోజు రాష్ట్రానికి  అత్యంత కష్టమైన రోజు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  గొప్ప స్నేహితుడ్ని కోల్పోయానని, పవార్ కుటుంబానికి ఇది తీరని లోటు అంటూ నివాళులర్పించారు. రాష్ట్రంలో మూడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను బుధవారం సెలవు దినాన్ని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలిసి బారామతికి వెళ్లారు. అక్కడ పవార్ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ను  కలిసి తమ సంతాపాన్ని  ప్రకటించారు. (Ajit Pawar jet crash : హాట్‌ టాపిక్‌గా ఆ ఇద్దరు పైలట్లు )

 

కాగా రాబోయే జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడానికి తన సొంత నియోజకవర్గమైన బారామతికి వెడుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం, బారామతిలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా, రన్‌వే సమీపంలో కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: నిజాయితీకి మూల్యం, అజిత్‌ పవార్‌ మృతిపై రాజ్‌ థాకరే వ్యాఖ్యలు

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement