మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బారామతి రన్‌వేకు 100 అడుగుల దూరంలో కుప్పకూలి.. మంటల్లో చిక్కుకున్న దృశ్యాల వీడియో వెలుగులోకి వచ్చింది. ఇవాళ ఉదయం (బుధవారం, జనవరి 28) 8:46: గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ మంటలు,ఆపై దట్టమైన పొగ వెలువడటం వీడియోలో కనిపించింది.

విఎస్ఆర్ (VSR) సంస్థకు చెందిన లియర్ జెట్ 45 (Learjet 45).. ఉదయం 8:10 గంటలకు ముంబై నుండి బయలుదేరింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ (66)తో పాటు విమానంలో ఉన్న మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాడార్ సమాచారం ప్రకారం.. విమానం ఉదయం 8:45 గంటలకు రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. విమానం కూలిపోయే ముందు రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించింది. సంకేతాలు నిలిచిపోయే సమయానికి విమానం 1016 మీటర్ల (సుమారు ఒక కిలోమీటర్) ఎత్తులో, గంటకు 237 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన
విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. పైలట్ నుంచి మేడే కాల్ రాలేదన్న ఆ శాఖ.. బారామతి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చాకే ల్యాండింగ్‌కు యత్నించారని పేర్కొంది. రన్ వే నెంబర్ 11పై ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతి ఇచ్చిందని తెలిపింది. 8.44 గంటలకు పొగల, మంటల కనిపించాయని ఏటీసీ చెబుతోంది. రన్ వే గుర్తింపులో పైలట్లు ఇబ్బంది పడ్డారని.. తొలి ప్రయత్నంలో రన్ వే కనిపించకపోవడంతో కాసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. రెండో ప్రయత్నంలో ల్యాండ్ అయ్యేందుకు యత్నించి విఫలయినట్లు ఏటీసీ తెలిపింది.
ఇవాళ అజిత్ పవార్.. తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. అజిత్ పవార్‌తో పాటు ముంబై పీఎస్వో విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి, పైలట్లు కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్ మరణించారు.

CCTV footage of the collision impact of the chartered aircraft, carrying Maharashtra deputy CM Ajit Pawar and 4 others, which crash landed. pic.twitter.com/vf9X7TGffJ
— Believer (@PredatorVolk) January 28, 2026


