క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు

Tristyn Bailey was stabbed 114 times in an unspeakable murder - Sakshi

అమెరికాలో ఓ బాలుని నిర్వాకం

40 ఏళ్ల జైలుశిక్ష

ఫ్లోరిడా: అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లేకు చెందిన అయ్‌డెన్‌ ఫుస్సి అనే 13 ఏళ్ల బాలుడు తోటి విద్యార్థినిని అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు. ఏకంగా 114 సార్లు పొడిచి చంపాడు! అకారణంగా ఈ అమానుషానికి పాల్పడ్డ బాలునికి కోర్టు 40 ఏళ్ల జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2021లో జరిగింది. తన క్లాస్‌మేట్, చీర్‌ లీడర్‌ అయిన ట్రిస్టిన్‌ బైలీ (13)ని ఫుస్సి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొట్టన పెట్టుకున్నాడు. కేవలం ఎవరో ఒకరిని చంపాలనే ఉద్దేశంతోనే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే అతనీ దారుణానికి ఒడిగట్టినట్లు జడ్జి చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top