41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష

Serial Rapist Sentenced Nearly 1000 Years Prison In South Africa - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక కోర్టు సంచలన తీర్పు వెలువ‌రించింది. 40 ఇండ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు వెయ్యేండ్ల‌కు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి (2014-19) మధ్య ఇండ్ల‌లో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగ‌త‌నాల‌తో పాటు మహిళలపై అత్యాచారాల‌కు పాల్ప‌డేవాడు. ప‌లువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల‌ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు.

ఆ త‌ర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్ల‌లో చోరీలకు పాల్ప‌డ‌టంతో పాటు 41 మంది మహిళలపైగా అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది. ఈ క్రమంలోనే న్యాయ‌స్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల‌ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
చదవండి: లైవ్‌లో రిపోర్టింగ్‌.. అనుకోని అతిథి రావడంతో షాక్‌

భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top