ఇంటింటికీ నీరందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ నీరందించడమే లక్ష్యం

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

ఇంటింటికీ నీరందించడమే లక్ష్యం

సంగెం : ఇంటింటికీ తాగు నీరందించడమే లక్ష్యంగా గవిచర్లలో పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు సర్పంచ్‌ బాషిపాక సదయ్య తెలిపారు. ఆ గ్రామంలోని గుండ బ్రహ్మయ్య ఆలయం సమీపంలో సుమారు 1500 మీటర్ల పైపులైన్‌ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామంలోని అన్ని వాడలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నీరు వృథా కాకుండా వాడుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గుమ్మడి సంపత్‌, మాజీ సర్పంచ్‌ పత్తిపాక రమేశ్‌, వార్డు సభ్యులు అశోక్‌, వర్ష, రమ, రాధిక, పూజ, కరుణాకర్‌, అనిల్‌, జీపీ కార్యదర్శి సునీత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement