ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

వర్ధన్నపేట/రాయపర్తి/పర్వతగిరి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు చెల్లింపులను త్వరగా అందించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. బుధవారం వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల పరిధిలోని ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమశాతం పరీక్షలు, గన్నీ బ్యాగుల లభ్యత, ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, కూర్చునే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేగవంతంగా కాంటాలు పూర్తిచేసి గోదాం, మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం ఐకేపీ కేంద్రాల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్ధన్నపేటలోని వీరభద్ర రైస్‌ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌, సివిల్‌ సప్‌లై డీఎం సంధ్యారాణి, ఎంపీడీఓ వెంకటరమణ, వ్యవసాయ, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పనులపై సమీక్ష

న్యూశాయంపేట: మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సమీక్ష ని ర్వహించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన మౌలిక వసతులు, రహదారి సదుపాయాలు, విద్యుత్‌ తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్డీఓ సుమ, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌, ఎయిర్‌పోర్ట్‌ అధికారి నటరాజ్‌, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, అధికారులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగవంతం

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా మద్దతు ధర అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,457 మంది రైతుల నుంచి రూ.213.45 కోట్ల విలువైన 88,937.20 మెట్రిక్‌ టన్నుల మక్కలను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలి

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ప్రతీ 45 రోజులకు ఒకసారి ఆస్పత్రుల డైట్‌ క్యాంటీన్‌లలో తనిఖీ చేపట్టాలని కలెక్టర్‌ సత్యశారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్ట్రీట్‌ఫుడ్‌ వెండర్స్‌ విక్రయిస్తున్న ఆహార పదార్థాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ

Advertisement
 
Advertisement
Advertisement