విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలి

May 10 2026 7:28 AM | Updated on May 10 2026 7:28 AM

డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌

కాళోజీ సెంటర్‌: ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. శనివారం గూగుల్‌ మీట్‌ ద్వారా ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడారు. విద్యావారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అడ్మిషన్స్‌ ప్రచార సామగ్రి ప్రదర్శన, రెండో రోజు రెమీడియల్‌ తరగతుల ముగింపు, మూడో రోజు అడ్మిషన్లకు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పేరెంట్స్‌ మీట్‌, లైబ్రరీ అవగాహన, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై అవగాహన, చివరి రోజు విద్యా విజయోత్సవంగా ఉత్తమ విద్యార్థులను సన్మానించాలన్నారు. ఈ గూగుల్‌ మీట్‌లో 11 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

గీసుకొండ: మండలంలోని రాంపూర్‌లో అభయాంజనేయస్వామి యంత్ర, విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య ప్రాణప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి పూ జా కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రడం భరత్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ తాబేటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకుడు గోపాల నవీన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

గోదాముల పరిశీలన

చెన్నారావుపేట: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్‌ డీఎం చంద్రశేఖర్‌ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శనివారం గోదాముల ఇన్‌చార్జ్‌ సుమన్‌రావుతో కలిసి గోదాముల నిల్వల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి మక్కల దిగుమతి వేగవంతం కానుందని, మక్కల నిల్వకు స్థానిక అధికారులు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దన రమేశ్‌ మాట్లాడుతూ ప్రతీ గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య గోపాల్‌నాయక్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మొగిలి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మంద యాకయ్య, సర్పంచ్‌ కంది శ్వేత కృష్ణచైతన్యరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

వరంగల్‌, కరీంనగర్‌

బిషప్‌గా విజయపాల్‌రెడ్డి

గీసుకొండ: వరంగల్‌, కరీంనగర్‌ క్రైస్తవ సంఘం బిషప్‌గా గీసుకొండ మండలం మనుగొండకు చెందిన దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డి శనివారం నియమితులైనట్లు గ్రామపెద్ద అల్లం మర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు రోమ్‌లోని పోప్‌ నుంచి ఆదేశాలు వెలువడినట్లు పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన విజయపాల్‌రెడ్డి క్రైస్తవ మత, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో గుర్తింపు పొందాడన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

నర్సంపేట: వడదెబ్బతో నర్సంపేట 16వ వార్డు పరిధి నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మెందుల ఐలయ్య(55) మృతి చెందాడు. ఐలయ్య శుక్రవారం మధ్యాహ్నం గేదెలను మేపుతున్న క్రమంలో ఎండ తీవ్రతతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబీకులు శనివారం తెలిపారు. కాగా, స్థానిక కౌన్సిల్‌ బానోత్‌ నవీన్‌నాయక్‌.. ఐలయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement