అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని | - | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయాన్ని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పూర్ణచందర్‌, మయూరి, స్రవంతి, సతీశ్‌, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీధర్‌రావు.. ఎమ్మెల్యే దంపతులను పూర్ణకుంభంతో స్వాగతించారు. ఎమ్మెల్యే దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో నూతన రథం నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వీలైనంత త్వరగా రథనిర్మాణం పూర్తి చేయాలని రథ శిల్పి ప్రవీణ్‌ ఆచార్యకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement