నల్లబెల్లి : పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ తెలిపారు. మండలంలోని గుండ్లపహాడ్‌లో కూస అనిత రంజిత్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని చరణ్ సింగ్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. మిగతా లబ్ధిదారులు సైతం త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోదన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌లు వైనాల అశోక్, కడుదూరి కట్టయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, సర్పంచ్ కడుదూరి అనిత శ్రీనివాస్, నాయకులు గోవిందు రంజిత్, కూస బాబు తదితరులు పాల్గొన్నారు.


