మక్కల గోదాం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మక్కల గోదాం ప్రారంభం

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

మక్కల గోదాం ప్రారంభం

పర్వతగిరి : మండలంలోని దౌలత్‌నగర్‌లో మొక్కజొన్నల గోదాంను పర్వతగిరి పీఏసీఎస్‌ సీఈఓ సురేశ్‌ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రబీలో రైతులు మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేయగా దిగుబడి సైతం అంచనాకు మించి వచ్చిందన్నారు. సరిపడా గోదాములు లేకపోవడంతో కొద్ది రోజులు రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ప్రభుత్వం గోదాంలను కేటాయించిందని తెలిపారు. త్వరలోనే మక్కల కొనుగోళ్లు, దిగుమతి పూర్తి అవుతాయని వివరించారు. కార్యక్రమంలో చింతపట్ల మల్లికార్జున్‌, సంపత్‌, శేఖర్‌, సునీల్‌, యాకయ్య, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement