● అకాల వర్షంతో తడిసిన మక్కలు, ధాన్యం
● కాంటాలు కాక అన్నదాతల ఆందోళన
నల్లబెల్లి: అకాల వర్షాలు రైతుల కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నోటికాడికొచ్చిన ధాన్యం, మక్కలు తడిసిపోతున్నాయి. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నల్లబెల్లి ఽమక్కజొన్న కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న మక్కలు తడిశాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని గాలితో పాటు వ ర్షం రావడంతో ఆరబోసిన, బస్తాల్లో నింపిన మక్కలు తడిశాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు ఏమిచేయలేని స్థితిలో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని మక్కలను తీసుకొస్తే నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసిన వాటిని గోదాములకు తరలించకపోవడంతో మక్కలు తడుస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి కొ నుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మక్కలను గోదాములకు తరలించాలని రైతులు కోరుతున్నారు.
నేలవాలిన వరి పొలాలు
ఖానాపురం: అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం కలుగుతుంది. సబ్‌మార్కెట్‌లో ఆరబోసుకు న్న మక్కలతో పాటు పొలాలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శనివా రం రాత్రి కురిసిన వర్షంతో వరి పొలాలు నేలవాలి పోయాయి. కోతదశలో ఉన్న పొలాలు నేలవాలడంతో రైతులకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
ఈఫొటోలో తడిసిన మక్కల బస్తాలను వేరు చేస్తున్న రైతు నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పత్తి సారయ్య. తనకున్న 30 గుంటల భూమిలో పండించిన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. నిర్వాహకులు గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో రూ.1,500 పెట్టి సంచులు కొనుగోలు చేసి మక్కలు నింపాడు. 10 రోజుల క్రితం నిర్వాహకులు కాంటా పెట్టడంతో రూ.1,250 హమాలీలకు ఇచ్చాడు. వాతావరణం సరిగా లేదని, టార్పాలిన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో రూ.5,600 ఖర్చు చేసి టార్పాలిన్లు కొనుగోలు చేసి బస్తాలపై కప్పాడు. అయినా శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పరుదాల్లోనుంచి వర్షపు నీరు వెళ్లి బస్తాలు తడిశాయి. ఇలాంటి దుస్థితి సారయ్య ఒక్కడిదే కాదు కొనుగోలు కేంద్రాల్లోకి మక్కలు తీసుకొచ్చిన రైతులందరిదీ ఇలానే ఉంది.


