విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూత | - | Sakshi
Sakshi News home page

విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూత

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

అదనపు కలెక్టర్‌ గణేశ్‌

నర్సంపేట: విద్యాభివృద్ధికి ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని అదనపు కలెక్టర్‌ వైవీ.గణేశ్‌ అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల సందర్భంగా బుధవారం నర్సంపేట పట్టణంలోని సిటిజన్‌ క్లబ్‌లో సర్పంచ్‌లు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య లభించడంతో పాటు పలు రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యా బలోపేతానికి ఉచితంగా పాఠశాల స్థాయి అవసరాలతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుకు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలన్నారు. విద్యాభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మిరామానంద్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతూ వసతులతో పాటు బోధన సామగ్రిని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, జిల్లా పశువర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, సీఎంఓ శ్రీనివాస్‌, డీఎల్‌పీఓ రాజీవ్‌కుమార్‌, నర్సంపేట ఎంపీడీఓ కె.శ్రీనివాస్‌, ఎంఈఓ కొర్ర సారయ్య, ఎంపీడీఓలు వెంకటశివానంద్‌, కె.రవీందర్‌, అ ద్వైత, ఎంఈఓలు పాపమ్మ, రవీందర్‌, అనురాధ, వెంకటేశ్వర్లు, చరణ్‌సింగ్‌, రవి, నరసింహస్వామి, ప్రిన్సిపాల్‌ నవీన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement