అక్కున చేర్చుకుంటున్న వినోదమ్మ
అనాథలకు
అమ్మ
వేలేరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్ చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంటలకు సరిపడా సాగునీరు
గౌరవెల్లి ప్రాజెక్టు పైపులైన్ పనులు పూర్తిచేసి పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని డీఈ కిషన్‌ప్రసాద్ అన్నారు.
సెంటర్‌స్ప్రెడ్‌లో u
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.


