● వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్‌ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ పదోన్నతులతో కేవలం హోదా పెరగడమే కాకుండా ప్రజల కోసం మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజా సమస్యలను సానుభూతితో వినడం, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవడం, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.


