సీపీ సన్ ప్రీత్ సింగ్
ఆత్మకూరు: చెక్ పోస్ట్ వద్ద వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మండలంలోని కటాక్షపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రిజిస్టర్లను తనిఖీ చేసి చెక్ పోస్ట్ వద్ద సౌకర్యాలు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలిచ్చారు. కంటైనర్లను సైతం తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా మండలంలోని నీరుకుల్ల దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీ సందర్శించారు. లారీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు సీపీ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ వెంట సీఐ సంతోశ్, సిబ్బంది ఉన్నారు.


