రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

18న ధర్మవాణి ‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన

న్యూశాయంపేట: జిల్లాలో రబీ 2025 – 26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,93,809 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి 30,371 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 27,680 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిపారు. 2,492 మంది రైతుల ఖాతాల్లో రూ.36.43 కోట్ల విలువైన ధాన్యం డబ్బులను జమ చేసినట్లు కలెక్టర్‌ వివరించారు.

97,191 మెట్రిక్‌ టన్నుల మక్కల కొనుగోలు

వరంగల్‌ జిల్లాలో శుక్రవారం వరకు 97,191.350 మెట్రిక్‌ టన్నుల మక్కలను రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. 19,099 రైతుల నుంచి 233.25 కోట్ల రూపాయల విలువగల మొక్కజొన్నను సేకరించినట్లు వివరించారు. రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు.

త్వరగా చేపలు పట్టాలి

గీసుకొండ: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, జలాశయాల్లోని నీరు అడుగంటి పోతుండడంతో చెరుల్లోని చేపలను మత్స్యకారులు వీలైనంత త్వరగా పట్టుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) పిల్లి శ్రీపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 706 చెరువులు ఉండగా ఏప్రిల్‌ ఒకటి నాటికి 300 చెరువుల్లో చేపలు పట్టారని, మరో 200 చెరువుల్లో ఈనెల 25లోపు, జూన్‌ నెలాఖరులోపు 206 చెరువుల్లో పట్టడం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎండదెబ్బ తగలకుండా మత్య్సకారులు ఉదయం 5 నుంచి 11 గంటల లోపు చేపలు పట్టాలని పేర్కొన్నారు. చేపలు పట్టేవారు, అమ్మే వారు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

వేయిస్తంభాల ఆలయంలో

మాసశివరాత్రి పూజలు

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు. కాగా, నేడు శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ దేవాదాయఽ ధర్మాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వరంగల్‌ దేవాదాయశాఖ డీసీ, అసిస్టెంట్‌ కమిషనర్‌ సునీత శుక్రవారం తెలిపారు. ప్రజలు, భక్తులు, అర్చకులు, ఇతర ఉద్యోగులు తమ సమస్యలను వివరించి, పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు.

వరంగల్‌ అర్బన్‌ : బల్దియా పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల కమిటీ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, సీహెచ్‌ఓ రమేశ్‌, ఈఈ మహేందర్‌, రాజేశ్‌ పాల్గొన్నారు. కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. మొత్తం 42 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 34 మంది అ భ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపా రు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement