పరకాల జనాభాను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాను పెంచాలని గతంలోనే మిషన్ భగీరథ నీటి సరఫరా విభాగం అధికారులను కోరాం. కానీ, వారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో పట్టణ ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. 6 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు పంపిణీ చేయడం ఓ సవాలుగా మారుతోంది. – రంజిత్, పరకాల
మున్సిపల్ ఏఈ, ఇన్‌చార్జ్ కమిషనర్
బావుల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నాం..
మిషన్ భగీరథ పైపులు వేస్తుంటే ఎంతో సంబురపడ్డాం. ఆసంబురం ఎన్నో రోజులు నిలవలేదు. రోజూ సరిపడా నీళ్లు రావట్లేదు. నీళ్లు వచ్చినా సరిపడకపోవడంతో బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ట్యాంకర్ల ద్వారా రోజూ ఒక డ్రమ్ము నీళ్లు ఇవ్వాలి.
– రజని, గౌడవాడ, పరకాల
ఏళ్లుగా నీళ్లకు గోస పడుతున్నాం..
ఈ ఊర్లో నీళ్ల కష్టాలు చూసి పిల్ల ను ఇవ్వాలంటే భయపడేవాళ్లు. వాళ్లు భయపడ్డట్లే ఎన్నో ఏళ్లుగా పరకాలకు నీళ్ల కష్టాలు పోవడం లేదు. నీళ్ల కష్టాలు చూసి కొందరు బోరింగులు వేస్తే వాటిని బాగుచేసేవాళ్లు లేరు. కేసీఆర్ సార్ ఇచ్చిన నల్లాల నుంచి నీళ్లు ఎక్కువ రావట్లేదు.
– రాజేశ్వరి, వడ్లవాడ, పరకాల


