వర్ధన్నపేట: ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను జిల్లా పంచాయతీ అధికారి కల్ప న ఆదేశించారు. మండలంలోని ఇల్లంద గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుల ప్రస్తుత స్థితిగతులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పాలనాపరమైన అంశాల్లో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి, ఎంపీఓ శేషంజన్ స్వామి, పంచాయతీ కార్యదర్శి శంకర్‌రావు, జీపీఓ లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి కల్పన


