● గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, స్వీయ గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు రోడ్డు జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ‘జనగణన–27లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరిద్దాం’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


