ఆయిల్‌పామ్‌ తోట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ తోట దగ్ధం

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

నెక్కొండ: ప్రమాదవశాత్తు ఆయిల్‌పామ్‌ తోట దగ్ధమైన సంఘటన అలంకానిపేట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన బాధిత రైతు చీకటి శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. తనకున్న 6 ఎకరాల్లో ఉపాధి హామీ పథకం కింద 2019లో ఆయిల్‌పామ్‌ సాగుచేశాడు. ఇప్పుడు గెలలు కోసే దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. దీంతో గమనించిన స్థానికులు, రైతులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని శ్రీనివాస్‌ వాపోయాడు. తోట మీదుగా వదులుగా ఉన్న విద్యుత్‌ తీగల రాపిడితో నిప్పు వచ్చి పడడంతోనే ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నాడు. అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement