వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్‌గౌడ్‌

కమలాపూర్‌: విద్యార్థులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ సూచించారు. కమలాపూర్‌లోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వేసవి శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, క్రీడలు, సంగీతం, నృత్యం, డ్రాయింగ్‌, వివిధ రకాల బోధనలు, నైపుణ్యాలు, యోగ, మెడిటేషన్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, క్విజ్‌ కాంపిటీషన్స్‌, స్టోరీ టెల్లింగ్‌, పుస్తక పఠనం, కంప్యూటర్‌ బేసిక్‌ పరిజ్ఞానం, కుట్లు, అల్లికలు, కాలీగ్రఫీ, ఇండోర్‌ గేమ్స్‌, బేసిక్‌ మ్యాథ్స్‌, మోరల్‌ ఎడ్యుకేషన్‌, ఆర్ట్స్‌, క్రాఫ్ట్‌స్‌ తదితర అంశాల్లో నిపుణులతో మెళకువలు నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పబ్బు సతీశ్‌, బండి వనజకళాధర్‌, ఉపసర్పంచ్‌ పాక మమత, ఎంఈఓ శ్రీధర్‌, ప్రిన్సిపాల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అనిత, ఐఈబీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోఆర్డినేటర్‌ సుమాదేవి, ఏఎంఓ మన్మోహన్‌, ఎంపీడీఓ గుండె బాబు, ఏఏపీసీ చైర్మన్‌ సరిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సెలవులు వినియోగించుకోండి

హసన్‌పర్తి: విద్యార్థులు వేసవి సెలవులు వినియోగించుకోవాలని డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. గిరిరాజ్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరవగా, ఎంఈఓ శ్రీనివాస్‌, ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ మహేశ్‌, ఏఎంఓ మన్మోహన్‌, కళాశాల అభివృద్ధి కమిటీ కోశాధికారి చకిలం రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేజీవీవీలో...

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌, కో–ఆర్డినేటర్‌ సునీత, స్పెషల్‌ ఆఫీసర్‌ స్వప్న తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement