● మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబు
ఖానాపురం : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు తెలిపారు. మండలంలోని బుధరావుపేట ఆంజనేయ పొదుపు, పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి సరైన ధర పొందాలని సూచించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నర్సంపేట చెర్మన్ యడ్ల భిక్షంరెడ్డి మాట్లాడుతూ రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పెసరు రాణి, ఏఈఓ రాజ్‌కుమార్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు, చెడిపాక ఉపేందర్, కొండ్లె మధు, బిక్కి మురళి, గిరగాని నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
దళారులకు విక్రయించొద్దు
చెన్నారావుపేట : రైతులను దళారులకు ధాన్యం విక్రయించొద్దని మండల ప్రత్యేక అధికారి బాలకృష్ణ కోరారు. మండల కేంద్రంలో నవభారతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే పంట ఉత్పత్తులను విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు గంగిడి కవిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దెన రమేశ్, నాయకులు వీరారెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణ చైతన్యరెడ్డి, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.


