నర్సంపేట: బాలికపై అత్యాచారం చేసిన బండి సాయిభగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తి, దైవభక్తి, సీ్త్రల మీద తమకు ఎక్కడాలేని గౌరవం ఉన్నట్లు బహిరంగ సభలు, ప్రెస్‌మీట్లలో గొప్పలు చెప్పుకునే బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులకు బండి సాయి భగీరథ్ దుర్మార్గం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా పరాయి ఆడపిల్లలను ముఖ్యంగా మైనార్టీ తీరని బాలికలను నిత్యం వేధిస్తూ వెంటపడే క్రూర మనస్తత్వం కలిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కుమారుడు సాయి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే బండి సంజయ్‌కుమార్‌ను మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయాలని పేర్కొన్నారు. బండి సంజయ్ చేతిలో అధికారం ఉన్నంతసేపు బాధిత బాలికకు న్యాయం జరగదని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, మహమ్మద్ సంథాని, తదితరులు పాల్గొన్నారు.


