నర్సంపేట: దేశంలో పెరిగిపోతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసీపీఐ(యూ) జాతీ య ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్, పొలిట్‌బ్యూరో సభ్యుడు కుల్దీప్‌సింగ్ అన్నారు. ఈ మేరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపకుడు మ ద్దికాయల ఓంకార్ శతజయంతి వారోత్సవాల ము గింపు సందర్భంగా పట్టణంలోని నెక్కొండ రోడ్డు సర్కిల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ ముందు కోలాటాలు, డప్పు బృందం కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఓంకార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయన్నారు. అరుణోదయ విమలక్క, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు గంగాధర్, ఉపేందర్‌రెడ్డి, సుధాకర్, సుకన్య, తదితరులు పాల్గొన్నారు.
ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్


