సమయపాలన లేదు.. | - | Sakshi
Sakshi News home page

సమయపాలన లేదు..

May 9 2026 7:14 AM | Updated on May 9 2026 7:14 AM

వాళ్ల ఇష్టం వచ్చినసమయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం, మరోసారి రాత్రిపూట నల్లాలు వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలోకంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్‌మన్‌ను అడిగితే పైపులైన్‌ లీకేజీ ఉందని, అందుకే నీరు ప్రెజర్‌ తక్కువగా ఉందని చెబుతున్నాడు.

– పిల్లల సామ్రాజ్యం,

ఉర్సుబొడ్రాయి, వరంగల్‌

రోజంతా నీళ్లకాడనే..

నల్లా నీరు ప్రెషర్‌ తక్కువగా వస్తుంది. సన్నటి ధారలాగా వస్తుండడంతో రోజంతా నీళ్లకాడనే ఉండాల్సి వస్తోంది. మేము పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. నీటిదగ్గరనే సమయమంతా గడిచిపోవడంతో పనికి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతోపాటు ఏ సమయంలో నీటిని వదులుతారో అర్థంకాని పరిస్థితి.

– భాగ్యమ్మ, మైసయ్యనగర్‌, వరంగల్‌

Advertisement
 
Advertisement
Advertisement