పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్‌లో ఆదివారం వర్చ్‌వల్‌గా ప్రారంభించగా ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800–900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనుల నిమిత్తం ఖర్చు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


