వరంగల్ అర్బన్: జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను వేగంగా, సమర్థవంతంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. కాజీపేట పరిధి నక్కలగుట్ట, వరంగల్లోని కాశిబుగ్గ జీడబ్ల్యూఎంసీ సర్కిల్ కార్యాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. జనగణన వివరాల సేకరణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో నమోదవుతున్న వివరాలు, డేటా ఎంట్రీ పురోగతి, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రతీ ఇంటి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చే సేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్ర సన్నారాణి, అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్


