పారదర్శకంగా మక్కల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా మక్కల కొనుగోళ్లు

May 10 2026 7:28 AM | Updated on May 10 2026 7:28 AM

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: జిల్లాలో మక్కల కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ హాల్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,07,991 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారని, సుమారు 2,80,776 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. శనివారం నా టికి 69,140 మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా అందులో 51,302 మెట్రిక్‌ టన్నులను గోదాముల్లో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వైవీ.గణేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్‌ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ధాన్యం కొనుగోలు, ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌, జనగణన, విద్యా వారో త్సవాలపై సంబంధిత ఉన్నతాధికారులతో క లిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే విద్యావా రోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యా వారోత్సవాలను నిర్వహించాలి

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఎడ్యుకేషన్‌ వారోత్సవాలు (విద్యా) విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు, బడి మానేసిన పిల్లలను తిరగి పాఠశాలల్లో చేర్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

స్వీయగణనను సద్వినియోగం చేసుకోవాలి

కాశిబుగ్గ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ ద్వారా స్వీయ జనగణనను (సెల్ప్‌ ఎన్యుమరేషన్‌) సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సత్యశారద పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్‌ నుంచి ఐఎంఏ హాల్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఈనెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement