పంటలకు యూరియా వాడకం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పంటలకు యూరియా వాడకం తగ్గించాలి

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

పంటలకు యూరియా వాడకం తగ్గించాలి

శాయంపేట: పంటలో యూరియా వాడకాన్ని తగ్గించి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని వరంగల్‌ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్‌ విద్యాధర్‌, డాక్టర్‌ శ్రీజయ అన్నారు. మంగళవారం మండలంలోని వసంతాపూర్‌, ఆరెపల్లి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. రైతుల ఆదాయ వృద్ధి, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, సమష్టి మార్కెంటింగ్‌, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో ఎఫ్‌పీఓల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు సంఘటితంగా పని చేసినప్పుడే వ్యవసాయం లాభదాయక రంగంగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఓ ప్రియదర్శిని, ప్రొఫెసర్లు సిద్ధార్థ నాయక్‌, ఏఈఓ జ్యోస్న, వంశీకృష్ణ, సర్పంచ్‌లు భాస్కర్‌, దుర్నాల రమ, పీపీఓ హెడ్‌ ఉస్మాన్‌, వ్యవసాయ కళాశాల విద్యార్థులు అశ్మిత, అరుణ, దేవేందర్‌, శివాజీ, ప్రజ్వల్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఎన్‌జీఓ రాంబాబు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement