ఎల్లమ్మతల్లి చల్లని చూపు అందరిపై ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మతల్లి చల్లని చూపు అందరిపై ఉండాలి

May 9 2026 7:14 AM | Updated on May 9 2026 7:14 AM

ఎల్లమ్మతల్లి చల్లని చూపు అందరిపై ఉండాలి

హై కోర్డు జడ్జి జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి

దామెర: ఎల్లమ్మ తల్లి చల్లని చూపు అందరిపై ఉండాలని హై కోర్టు జడ్జి జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి అన్నారు. దామెర మండలంలోని ముస్త్యాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జడ్జి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠను వేద పండితులు మంత్రోచ్ఛరణ మధ్య ఘనంగా నిర్వహించారు. కాగా, జడ్జి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎల్లమ్మతల్లి దయతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జ్యోతి వరలక్ష్మీదేవి, నిర్వాహకులు బొల్లం లక్ష్మణ్‌, సాంబయ్య, చిలువేరు రాజు, శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ఎంపీపీ ఎండీ.జాకీర్‌అలీ, రమేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement