ఖర్చులను నియంత్రించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఖర్చులను నియంత్రించుకోవాలి

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

ఖర్చులను నియంత్రించుకోవాలి

ఖిలా వరంగల్‌: వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఖర్చులను నియంత్రించుకోవాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌, కార్యదర్శి మొగిలిచర్ల సుదర్శన్‌ సూచించారు. వరంగల్‌ శివనగర్‌లోని వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆర్‌.ఆనందరావు అధ్యక్షతన ఆది వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ ఆందోళనకర పరిస్థితుల ప్రభావం ప్రతి వినియోగదారుడిపై ఉంటుందని, ఖర్చుపై ప్రణాళికాబద్ధమైన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. జంక్‌ఫుడ్‌, ఇతర హోటల్‌ వంటకాలతో వచ్చే రోగాలపై మహిళలకు అవగాహన కల్పించాలని సుదర్శన్‌ కోరారు. అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తుల వ్యాట్‌ను తగ్గించాలని తీర్మానం చేశారు. జిల్లా ప్రతినిధులు లక్ష్మీనారా యణ, ఫజలుద్దీన్‌ అహ్మద్‌, రవికిరణ్‌, రామకృష్ణ, రాజేశ్‌ పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement