వర్ధన్నపేట: జనగణన.. దేశ భవిష్యత్, అభివృద్ధికి బలమైన పునాది అని, జనగణనలో ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా పాల్గొనాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద అన్నారు. పట్టణ కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు జనగణన అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జనాభా గణన కేవలం లెక్కలు సేకరించే ప్రక్రియ మాత్రమే కాదని, దేశ భవిష్యత్, అభివృద్ధికి దిశానిర్దేశం చేసే మహత్తర కార్యక్రమం అని గుర్తుచేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సెన్సస్ ద్వారా లభించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అవగాహన ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ ఖన్నా, వైస్ చైర్మన్ నేతావత్ శీభారాణి రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నూనావత్ కమ్లి కీమా, మాలోతు దేవేందర్, వాణి కుమారస్వామి, నాయకులు రవి, సురేష్, సత్యనారాయణ, దామోదర్, వెంకన్న, సర్పంచ్, మహిళలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద


