శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు

ఖిలా వరంగల్‌: రౌడీషీటర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌ హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలతో మామునూరు సబ్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేష్‌ నేతృత్వంలో స్థానిక రౌడీషీటర్లకు శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఈస్ట్‌ జోన్‌డీసీపీ అంకిత్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. రౌడీషీటర్లు, నేరప్రవర్తన కలిగిన వ్యక్తులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. చట్టాలను గౌరవిస్తూ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌ యాదవ్‌, జవ్వాజి సురేష్‌, విశ్వేశ్వర్‌, సంగెం ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement