ఖిలా వరంగల్: దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దివ్యాంగుల సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా శనివారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జిల్లా సంక్షేమ శాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ముత్తినే ని వీరయ్యతో పాటు నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్యాల శ్రీలక్ష్మీరామానంద్ హాజరై లబ్ధి దారులకు 20 రిట్రో ఫిటెడ్ మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ (ఎంపవర్ కార్ట్)–1, ట్యాబ్–1 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి, సాధికారతకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మబంధువుగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుద్ యాదవ్, జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్, జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యుడు వీరన్న, చక్రపాణి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
సహకార సంస్థ రాష్ట్ర చెర్మన్ ముత్తినేని వీరయ్య
దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ


