మాక్‌డ్రిల్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మాక్‌డ్రిల్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

ఖిలా వరంగల్‌: వివిధ శాఖల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్‌ పార్కు ప్రాంగణం గుండు చెరువులో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్‌డ్రిల్‌ జరగనుంది. ఈ మేరకు మాక్‌డ్రిల్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ సత్యశారద ఆదివారం సాయంత్రం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరెల్లి బుచ్చయ్య స్కూల్‌లో పునరావాస కేంద్రం, హెల్త్‌ క్యాంపు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయక చర్యలు, వైద్య సేవలు, తాగునీరు, ఆహార సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాని సూచించారు. మాక్‌ డ్రిల్‌ నిర్వహణలో పాల్గొనే రెవెన్యూ, పోలీస్‌, ఫైర్‌, వైద్యం, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, ప్రజలకు రక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ మాక్‌ డ్రిల్‌ ఉపయోగపడుతుందని కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి, తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement
 
Advertisement
Advertisement