‘భగీరథ్‌’ కేసు నీరుగార్చే కుట్ర | - | Sakshi
Sakshi News home page

‘భగీరథ్‌’ కేసు నీరుగార్చే కుట్ర

May 15 2026 9:56 AM | Updated on May 15 2026 9:56 AM

మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును నీరు గార్చడానికి కుట్ర జరుగుతోందని స్థానిక మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడ పోక్సో కేసు నమోదైనా నిందితులను వెంటనే అరెస్టు చేస్తారని, బండి భగీరథ్‌పై కేసు నమోదైనా చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లే భగీరథ్‌ను అరెస్టు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసును నీరు గార్చడానికే ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే భగీరథ్‌ను పోలీసుల ఎదుట హాజరుపర్చి విచారణకు సహకరించాలని కేంద్ర మంత్రి సంజయ్‌కు హితవు పలికారు. లేనిపక్షంలో పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం భగీరథ్‌ను సత్వరమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్‌ చైర్మన్లు వనంరెడ్డి, జక్కు రమేశ్‌, నాయకులు తూళ్ల కుమార్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌ను అరెస్టు చేయాలి

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరఽథను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ అంబేడ్కర్‌ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జన్ను నర్సయ్య, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లందాస్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ రేపిస్టులకు, నిందితులకు కేరాఫ్‌గా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి సంజయ్‌ పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్‌ జంగిలి భాస్కర్‌, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, నాయకులు తుమ్మల కుమార్‌, మహ్మద్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement