ఐనవోలు: మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం మాస సంక్రమణ పూజలు నిర్వహించారు. ఆదివారం సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆలయంలో వృషభ సంక్రమణ పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం మేలుకొలుపు, నిత్య ఆరాధనలు పూర్తయిన తర్వాత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, మల్లికార్జున స్వామితో బలిజ మేడలమ్మ, గోల్ల కేతమ్మల కల్యాణం, ఒగ్గు పూజారులచే పెద్ద పట్నం తదితర కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, భానుప్రసాద్, మధు, శ్రీనివాస్, నరేశ్, అర్చక సిబ్బంది పాల్గొన్నట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు.


