న ర్సుల సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

న ర్సుల సేవలు అభినందనీయం

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

ఎంజీఎం సూపరింటెండెంట్‌

హరిశ్చంద్రారెడ్డి

ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రుల్లో

ఘనంగా నర్సింగ్‌ దినోత్సవం

కాశిబుగ్గ: ఆస్పత్రుల్లో నర్సింగ్‌ సిబ్బంది పేషెంట్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంజీఎం సూపరింటెండెంట్‌ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సెస్‌ డే సందర్భంగా ఎంజీఎంలో ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కేక్‌ కట్‌ చేసి, నర్సింగ్‌ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు అశ్విన్‌, ఎ.మధుకర్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ దయాశీల, డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ వై.సుజాత, జ్యోతి, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సీకేఎం ఆస్పత్రిలో...

వరంగల్‌ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సింగ్‌ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రతిజ్ఞ చేశారు. కేక్‌ కట్‌ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు స్వరూప, బేబీ రాణి, జ్యోతిర్మయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement