breaking news
Caribbean sea
-
కరీబియన్ జలాల్లో అమెరికా మళ్లీ దాడి
వాషింగ్టన్: కరీబియన్ సముద్ర జలాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బోటుపై చేపట్టిన వైమానిక దాడిలో ఆరుగురు చనిపోయారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శుక్రవారం తెలిపారు. వీరంతా వెనిజులా జైలు నుంచి నడుస్తున్న ట్రెన్ డె అరాగ్వా గ్యాంగ్‌కు చెందిన వారేనన్నారు. ఈ ప్రాంతంలోని నార్కో– టెర్రరిస్ట్ డ్రగ్స్ రవాణాదారులను అల్‌ఖైదా ఉగ్రవాదులుగానే భావిస్తామన్నారు. వారిని వెంటాడి వేటాడి చంపుతామని హెగ్సెత్ హెచ్చరించారు. తాజా ఘటనతో సెపె్టంబర్ నుంచి ఆ ప్రాంతంలో అమెరికా చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 43కు చేరుకుంది. ఇలా ఉండగా, దక్షిణ అమెరికా ప్రాంతంలోకి విమాన వాహక నౌకను పంపిస్తున్నట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. గురువారం అమెరికా సైనిక సూపర్సోనిక్ హెవీ బాంబర్లు రెండు వెనిజులా తీరం వెంబడి చక్కర్లు కొట్టాయి. కరీబియన్ సముద్రం, వెనిజులా తీర వెంబడి అమెరికా బలగాల అసాధారణ మోహరింపులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో నార్కో టెర్రరిజమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దె దించే లక్ష్యంతోనే ఇవన్నీ చోటుచేసుకుంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. డ్రగ్స్ రవాణా ఒక కారణం మాత్రమే కాగా, ఆయా దేశాలను బెదిరించి దారికి తెచ్చుకోవడమే అమెరికా అసలు లక్ష్యమని పరిశీలకులు అంటున్నారు. -
7.7 తీవ్రతతో భారీ భూకంపం
-
కరేబియన్ దీవుల్లో భారీ భూకంపం
హవానా: కరేబియన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదు అయింది. జమైకా, క్యూబాలను కూడా భూ ప్రకంపనలు తాకాయి. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జార్జ్ టౌన్‌లోని కేమాన్ దీవులలో 0.4 అడుగుల సునామీ నమోదైంది. కానీ డొమినికన్ రిపబ్లిక్‌లోని పోర్ట్ రాయల్, జమైకా లేదా ప్యూర్టో ప్లాటా దగ్గర సునామీ కనిపించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా 6.1 తీవత్రతో సంభవించిన భూకంపం నుంచి పెద్దగా సునామీ ముప్పు ఏమీ లేదని పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం నుంచి సముద్ర తీర ప్రాంతానికి 300 కిలోమీటర్ల వరకు సునామీ తరంగాలు వస్తున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేమన్ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. క్యూబా, హోండూరస్, మెక్సికో, కేమన్, దీవులతోపాటు బెలిజ్, జమైకాలోని పలు ప్రాంతాలకు సునామీ ప్రమాదం పొంచి వుందని పేర్కొంది. గ్రాండ్ కేమన్లోని ఓగియర్లో నివసించే అలెక్ పుల్టర్ మాట్లాడుతూ ఇది తాను చూసిన మొట్టమొదటి భూకంపం కాదని, అయితే ఇది ఇప్పటివరకు అతిపెద్ద భూకంపం అని తెలిపారు. -
ఈ వధూవరులను గుర్తించండి!
లండన్: జలకాలాటలలో ఏమి హాయిలే అలా...అంటూ కరీబియన్ సముద్రంలో భుజాల వరకు నీటి మునిగి చెట్టాపట్టాలేసుకొని ముందుకు సాగిపోతున్నారు ఆ వధూవరులు. స్వచ్ఛమైన నీటి అడుగున ‘స్టింగ్రేస్ (పొడవాటి సన్నటి తోకగల చేపలు)’ గుంపులు గుంపులుగా దూసుకొస్తున్నా లెక్కచేయకా, గగన సీమలో పోటీపడి కమ్ముకొస్తున్న మంచు మబ్బులను చూస్తూ తన్మయత్నంలో తేలిపోతున్న వధూవరుల దృశ్యాన్ని జెన్నీ స్టాక్ అనే ఓ మెరైన్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ జంట అనుమతితోనే ముచ్చటైన వాళ్ల ఫొటోలు పలు తీశానని, వాళ్లకు ఈ ఫొటోలు అందజేయాలని ఆశిస్తున్నానని, అయితే వారు ఎక్కడున్నారో, వారి చిరునామా ఏమిటో తనకు తెలియదంటూ ఆమె ఇప్పుడు ప్రముఖ సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’ను ఆశ్రయించారు. వాళ్లను గుర్తించిన వెబ్సైట్ యూజర్లు దయచేసి వారి కాంటాక్ట్‌ను తనకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ‘స్వచ్చమైన కరీబియన్ సముద్రంలో మెరైన్ లైఫ్‌పై ఫొటోలు తీసేందుకు నేను గత మే నెలలో డొమెనికన్ రిపబ్లిక్కు వెళ్లాను. నీటి మునిగి నేను ఫొటోలు తీస్తుండగా, హఠాత్తుగా నా కెమెరా ముందుకు నవ వధూవరులు వచ్చారు. అప్పటికీ పెళ్లి దుస్తుల్లోనే ఉన్న పెళ్లి కూతురును చూసి ముచ్చటేసింది. ముళ్ల చాకు లాంటి తోకలో విషం గల స్టింగ్రేస్ (ఆపద ఎదురైనప్పుడు మాత్రమే ఆ చేపలు మనుషులపై దాడులు చేస్తాయి)ను కూడా లెక్కచేయకుండా వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోవడం మరింత ఆశ్చర్యం వేసింది. అందుకే వారి అనుమతితో వారి ఫొటోలు తీశాను. వారికి నన్ను కాంటాక్టు చేయాల్సిందిగా పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాను. అలల హోరులో వారికి నా మాటలు వినపడకపోవచ్చని ఇప్పుడనిపిస్తోంది. ఆ నవ వధూవరులు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఇంతకాలం నిరీక్షిస్తూ వచ్చాను. కనీసం వారు ఏ దేశస్థులో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ సాయం అర్థిస్తున్నాను. లండన్‌లోని లంకాషైర్‌లో నివసిస్తున్న నేను మెరైన్ ఫొటోగ్రాఫర్‌ను. నా ఫేస్బుక్ పేజీని సులభంగానే గుర్తించవచ్చు’ అంటూ ఆమె సోషల్ వెబ్సైట్ యూజర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


