
గుర్రంపోడు: తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో వేప చెట్లకు మళ్లీ ఆపద ముంచుకొస్తోంది. వేప చెట్లకు నెల రోజులుగా డైబ్యాక్ వ్యాధి వ్యాపిస్తోంది. కొమ్మ లు ఎండుతున్న వేప చెట్లు నల్లగొండ – దేవరకొండ ప్రధాన రహదారి వెంట కనిపిస్తున్నాయి. వేపకు మూడేళ్ల కిత్రం డైబ్యాక్ ఒక్కసారిగా విజృంభించడంతో.. కొమ్మలు ఎండటంతోపాటు చెట్లు కూడా కొన్ని నిలువునా ఎండిపో యాయి. అప్పట్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి ఒక కీటకం కారణమని గుర్తించారు. టీ మస్కిట్ బగ్ శిలీంధ్రంతోపాటు , క్లాడోస్పోరియం అనే శిలీంధ్రాల ద్వితీయ సంక్రమణం ద్వారా వేపకు ఎండుతెగులు సోకుతున్నట్లు అప్పట్లో నిర్ధారించారు.
సూర్యాస్తమయం తర్వాత టీ మస్కిట్ బగ్ పురుగులు.. వేపకణజాలంలోని రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు, కొమ్మలు ఎండిపోతాయి. వ్యాధి తీవ్రత అధికమై చెట్లు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. డై బ్యాక్ నివారణకు శాస్త్రవేత్తలు మందులు సూచించినా.. ఎత్తయిన చెట్లకు మందుల పిచికారీ చేసే పరిస్థితి లేదు.
చదవండి: 5 నమిషాల్లో జాబ్ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!