5 నిమిషాల్లో జాబ్‌ కొట్టేసింది..దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా! | College Student Lands Job in Just 5 Minutes, CEO Shares Inspiring Story | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో జాబ్‌ కొట్టేసింది.. దెబ్బకి కంపెనీ సీఈవో ఫిదా!

Oct 10 2025 2:40 PM | Updated on Oct 10 2025 3:15 PM

Tech CEO hires college student after 5minute chat shares story

చదువు అయిన తరువాత  ఉద్యోగం రావడం అంత సులువుకాదు. అదీ మన మనసుకు నచ్చిన  జాబ్‌  రావడమంటే జాక్‌ పాట్‌ కొట్టినంత ఆనందమే.  దీనికి టాలెంట్‌ ఒక్కటే ఉంటే సరిపోదు , తెగువ, స్మార్ట్‌నెస్‌ కూడా ఉండాలని నిరూపించిందో యువతి.   కేవలం అయిదే అయిదు నిమిషాల్లో  ఉద్యోగాన్ని సాధించిన యువతి  స్టోరీని టెక్ కంపెనీ సీఈవో  సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఈస్టోరీ నెట్టింట  హల్‌చల్‌ చేస్తోంది.

కోడ్ ఆఫ్ అజ్‌ CEO సాండి స్లోంజ్‌సాక్  అందించిన వివరాల  ప్రకారం కేవలం ఐదు నిమిషాలు మాట్లాడిన తరువాత ఒక కళాశాల విద్యార్థినిని తాను నియమించు కున్నట్లు  తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మనోధైర్యం, తెలివి, నిజాయితీపై ప్రశంసలు కురిపించారు. "తమ కంపెనీలో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు లేకపోయినా ... ఓపెన్ లెటర్ దరఖాస్తు పంపే ధైర్యం ఉంది, తనకు ఏమీ తెలియదని ఒప్పుకోవడమేకాదు,  కష్టపడి పని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది" అని చెప్పుకొచ్చారు. ఆమె సూపర్ కమ్యూనికేటివ్, స్ట్రెయిట్ షూటర్.  చాలా స్మార్ట్, చాలా వినయంతో ఉంది.  జీతం గురించి పట్టించుకోనని తెలిపిందంటూ ట్వీట్‌ చేశారు. ఖాళీ సమయంలో తన సొంత ప్రాజెక్టులలో పనిచేసిందని చెప్తూ, కృషి అంకితభావాన్ని గురించి చెప్పుకొచ్చారు. ఆమె నిజాయితీ, అభిరుచి, పట్టుదల తనను చాలా ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. మూడు నెలల కనీస వేతనంతో జాబ్‌ ఆఫర్‌ చేసి, రేపటినుంచే  ఉద్యోగంలో చేరిపోవచ్చని ఆమెకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. (హ్యాపీగా ఏసీ కోచ్‌లో తిష్ట, చూశారా ఈవిడ డబల్‌ యాక్షన్‌!)

సోషల్ మీడియా రియాక్షన్
సోషల్ మీడియాలో సీఈవో,  విద్యార్థిని ఇద్దరిపైనా ప్రశంసలు వెల్లువెత్తాయి.‘నిజమైన రత్నాన్ని  గుర్తించారు.. మీ కంపెనీలో నేర్చుకోవాలనే ఆమె ఆసక్తిని  ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉందా? అనే అసక్తిని ప్రదర్శించారు. రిక్రూటర్లు  అందరూ మీలా వుండరు సార్‌ , ఆమెకు ఎంచుకున్నందుకు సంతోషం, ఆమెను  మీ ఆధ్వర్యంలో బాగ నైపుణ్యాన్ని సాధిస్తుందని మరొకరు కమెంట్‌ చేశారు.

చదవండి: జస్ట్‌ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement