కొబ్బరినీళల్లో శరీరానికి అవసరమైన పోషకాలైన ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండటం వల్ల జ్వరానపడి తగ్గిన వారిని ఆ నీరసం నుంచి కోలుకోవడానికి కొబ్బరినీళ్లు తాగమని పెద్దలు చెబుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం కొంతమందికి హానికరం. ఎవరెవరు ఎక్కువ తాగకూడదో చూద్దామా?
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పొటాషియం స్థాయులు పెరుగుతాయి, ఇది గుండె రోగులకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే పొటాషియం గుండె కండరాలలో అడ్డంకిని కలిగిస్తుంది, ఇది గుండెపోటు అవకాశాలను పెంచుతుంది. ఈ దశలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో వస్తుంది కాబట్టి పెద్దలు కొబ్బరి నీళ్లను తక్కువ పరిమాణంలో తాగాలి..
అలాగే, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, మధుమేహులు, లో బీపీ ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు (coconut water) తక్కువ తాగడం మంచిది.
మీ ప్లేట్ ఎలా ఉండాలంటే..
మీరు తినే ఆహారంలో అంటే ఒక ప్లేట్‌లో 50 శాతం కూరగాయలు లేదా పండ్లు ఉండాలి. ఆహారంలో ప్రొటీన్ ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. నెమ్మదిగా తినాలి. డిన్నర్ త్వరగా ముగించాలి. వీటన్నింటినీ ఫాలో అయితే కడుపు నిండడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఫుడ్ ఎప్పుడూ లిమిటెడ్‌గానే తీసుకోవాలి. అప్పుడే దానిలోని పోషకాలు శరీరానికి అందుతాయని గుర్తించుకోవాలి. కాబట్టి తీసుకునే ఆహారం ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉండాలి.
చదవండి: మైండ్‌ఫుల్ కిచెన్ మూమెంట్


