breaking news
Army Colonel
-
పాక్ కల్నల్ ఇమ్రాన్ దారుణ హత్య.. భారత్ హస్తం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో భారత్ వ్యతిరేకులను టార్గెట్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. వారిని వెంటాడి మరీ చంపుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి ప్లాన్‌కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం పాకిస్తాన్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇమ్రాన్ దయాల్ ఐఎస్ఐ చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు కావడం విశేషం.వివరాల మేరకు.. పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేశారు. బుధవారం(జనవరి 28వ తేదీన) డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్ చనిపోయాడు. అయితే, పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది.BIG BREAKING NEWS 🚨 Pakistani Army Lt Col Imran Dayal shot dead by UNKNOWN MEN in Dera Ismail Khan, Pakistan.As per news reports, he was identified as a handler in the 2025 Pahalgam terror attack.ISI is also clueless. Police have no idea. He was a very close associate of… pic.twitter.com/747JDjA0yb— News Algebra (@NewsAlgebraIND) January 31, 2026కానీ, దాడి కారణంగా ఇమ్రాన్ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు. ఇక, ఇమ్రాన్ దయాల్.. భారత్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ముఖ్య కారకుడు అని తెలుస్తోంది. ఇమ్రాన్ హత్యతో రంగంలోకి దిగిన అధికారులు.. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా దాడులతో పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యంలో ఆందోళన మొదలైనట్టు సమాచారం. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు, ఇలా పాక్తిస్తాన్కు చెందిన కీలక నేతలను హతమారుస్తున్న నేపథ్యంలో వారంతా భారత్ దురంధర్‌లు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారత్‌కు చెందిన సీక్రెట్ ఏజెంట్లే వారిని హతమారుస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 🚨 BIG! Pakistani Army Lt Col Imran Dayal, identified as a handler in the 2025 Pahalgam terror attack, was SHOT DEAD by UNIDENTIFIED GUNMEN in Dera Ismail Khan👉 UNKNOWN GUNMEN continue to ELIMINATE terrorists in Pakistan 🔥#Agyat 👍👌👏 pic.twitter.com/lIqgxzBRsg— DR. AMIT MANOHAR (@dramitmanohar) January 31, 2026ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్‌లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుదాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, 80 మంది బీఎల్ఏ ఉద్యమకారులు మరణించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన 12 ప్రదేశాల్లో, ఏకకాలంలో ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా సిబ్బందిపై గన్స్, ఇతర ఆయుధాలతో దాడి చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు దిగింది. క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్ జిల్లాల్లో బీఎల్ఏ దాడులు చేసింది. దీంతో పాక్ సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగి, బీఎల్ఏ దాడుల్ని తిప్పికొట్టారు. అయితే, బలూచ్ నేతలే ఇమ్రాన్‌ను హత్య చేశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో కొన్నేళ్లుగా తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దళాలలకు, బీఎల్ఏకు మధ్య నిరంతరం ఘర్షణ కొనసాగుతూనే ఉంది.Dera Ismail Khan: Shaheed Lieutenant Colonel Imran Dayal was laid to rest in his ancestral village with full military honors.The funeral prayers were attended by GOC 40 Division, Major General Mudassar, who presented the national flag, which was received by the martyr’s son pic.twitter.com/ggnjdcuIuf— Makhdoom Shahab-ud-Din (@ShahabSpeaks) January 30, 2026 -
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్ ఆపరేషన్ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. ఇక కల్నల్ సోషియా తండ్రి తాజ్ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్ మొహ్మద్ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. Meet Taj Qureshi, the proud father of Colonel Sofiya Qureshi 🇮🇳“My grandfather, father & I were all in the #IndianArmy If I get a chance today, I will destroy Pakistan”Imagine RW & Godi Media question their patriotism everyday 💔Mad respect for the REAL HEROES OF INDIA 🫡🇮🇳 pic.twitter.com/CDHH2XoJkt— Ankit Mayank (@mr_mayank) May 7, 2025 ఇక సోఫియా తండ్రి తాజ్ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ఫ్స్ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్ సోఫియానే అట.విద్యా నేపథ్యం:కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్డీ ప్రోగ్రామ్ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. ఇక సైన్యంలో చేరాక తన కెరీర్లో ఆరేళ్లు యూఎన్ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..


