
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఒక రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ..ఓ వీడియోని నెటింట షేర్ చేసింది. ఆ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంది. అంతేగాదు ఆ వీడియోలో భారత్‌ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంతకీ ఎవరా ఆ రష్యన్ మహిళ అంటే..
రష్యన్ బనియాగా పిలిచే పోలినా అగర్వాల్ ఇన్‌స్టా వీడియోలో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ..హృదయపూర్వక సందశాన్ని షేర్ చేశారు. గురుగ్రామ్ నివాసిస్తున్న ఈ రష్యన్ మహిళ పోలినా అగర్వాల్ వీడియోలో తన అమ్మమ్మ భారత్‌లోని ఉద్రిక్త పరిస్థితులు గురించి విని తక్షణమే రష్యాకు వచ్చేయాలని ఆదేశించిందని అన్నారు. అందుకు తానే ఏమని బదులిచ్చిందో వివరించింది.
పోలినా ఏం చెప్పారంటే..భారతదేశం అచ్చం మన సొంతిల్లు మాదిరిగా సురక్షితమైనదని చెప్పానని అన్నారు వీడియోలో. రష్యా అందించిన ఆయుధ సంపత్తి తోపాటు భారత్ మిలటరీకి ఉన్న సైన్యం తదితరాలు ఆ దేశానికి ఉన్న అతి బలమైన రక్షణ వ్యవస్థ అని కొనియాడింది. భారత్ మిలటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకలా డ్రోన్‌లు, విమానాలు ఉన్నాయి. దానికి తోడు అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా పాటుపడే సైనికుల నిస్వార్థ సేవ , అంకితభావం తదతరాలు అంతకమించిన వజ్రాయుధాలని పేర్కొంది.
వాళ్లంత తమ ప్రాణాలు పణంగా పట్టి ఆహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారు. అందువల్ల మేమంతా ఇక్కడ హాయిగా మా జీవితాలను జీవించగలుగుతున్నాం. యుద్ధ జరుతుందన్న భయం కూడా మా దరి చేరదు. అంతలా రక్షణ అందిస్తారు ఆ వీరసైనికులు. అందుకు నేను వారికి ఎంతగానే కృతజ్ఞతతో ఉన్నాను. వారి రక్షణలో ఉన్న భారత్‌ని ప్రశాంతమైన ఇల్లుగా చెప్పగలనని పోలినా నమ్మకంగా చెప్పింది. అంతేగాదు ఆ వీడియోకి " ఇక్కడ రాత్రిపూట మేమంతా హాయిగా నిద్రపోతున్నాం అంటే అందుకు కారణం భారత సైనికులనే వారికి సదా రుణపడి ఉంటామని" క్యాప్షన్ కూడా ఇచ్చారామె.
ఆ వీడియోకి ఏకంగా లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు సైతం ప్రతిరోజూ మమ్మల్ని రక్షించే మా సైనికుల అంకితభావం, ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వారి త్యాగాన్ని విదేశీయురాలుగా మీరు కూడా గుర్తించినందుకు ధన్యవాదాలు అని పోస్ట్‌లు పెట్టారు.
(చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!)