
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో భారత్ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత సైన్యం ధ్వంసం చేసింది. అలాగే పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది భారత్. గత శనివారమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేగాదు భారత్ ఉగ్రమూకల్ని మట్టుబెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అలాగే ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో దాయాది దేశానికి తెలిసి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి గస్తీ కాస్తూ.. ఆహర్నిశలు దేశాన్ని రక్షిస్తున్నా మన సైనికులు యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.
ఎదురులేని ధైర్యసాహసాలకు గర్వకారణమైన మన భారత సైనికుల యూనిఫాం..చూడగానే ఎక్కడ లేని దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా మన అటెన్షన్ కూడా గౌరవంతో కూడిన బాధ్యతగా వ్యవహరించేలా మారిపోతుంది. అలాటి ఆర్మీ యూనిఫాం వలస పాలన నుంచి ఎలా రూపుదిద్దుకుంటూ..సరికొత్త మార్పులతో వచ్చింది..?. పైగా సైనికులకు సౌకర్యంగా ఉండేలా ఫ్యాబ్రిక్ తీసుకురావడమే గాక ఆ రంగులనే ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటో చూద్దాం..!.
75 ఏళ్ల క్రితం..
భారతీయ సాయుధ దళాల యూనిఫాంల మూలం వలసరాజ్యాల వారసత్వంగా వచ్చింది. మొదట్లో బ్రిటిష్ సైనిక సంప్రదాయం కొనసాగించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్‌ను తన బలమైన కోటగా మార్చుకున్న తర్వాత దేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించింది. అవి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పుడ మన భారతీయ సైనికులు బ్రిటిష్ సహచరుల మాదిరిగానే పాక్షికంగా ఎరుపు రంగు యూనిఫాంలు ధరించేవారు. అయితే ఈ ఎరుపు రంగు వల్ల యుద్ధభూమిలో చాలా స్పష్టంగా కనిపించేవారు. దాంతో విపరీతమైన ప్రాణనష్టం జరిగేదట. అప్పుడే యూనిఫాంలో మార్పు అవసరం అనేది గుర్తించారట.
ఖాకీ ఎప్పుడు వచ్చిందంటే..
1848లో, అధికారులు సర్ హ్యారీ బర్నెట్ లమ్స్‌డెన్, విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్ భారతదేశంలోని బ్రిటిష్ వలస దళాల కోసం ఖాకీ యూనిఫామ్‌లను ప్రవేశపెట్టారు. ఉర్దూలో దుమ్ము రంగు అని అర్థం వచ్చే "ఖాకీ",రంగు భారతీయ ప్రకృతి దృశ్యంతో బాగా కలిసిపోయింది. పైగా దీని కారణంగా ప్రాణ నష్టం తగ్గిందట కూడా. 1857 భారత తిరుగుబాటు సమయానికి, భారతదేశం అంతటా బ్రిటిష్ దళాలు ఖాకీని విస్తృతంగా స్వీకరించాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలను ప్రభావితం చేసి..క్రమంగా వరల్డ్ ఫీల్డ్ యూనిఫామ్‌ల రంగుగా మారింది.
స్వేచ్ఛకు సంకేతంగా మార్పు..
1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని కాస్తా ఇండియన్ ఆర్మీగా పేరు మార్చారు. అలాగే పాక్ నుంచి వేరై..దేశభక్తిని సూచించేలా ఆలివ ఆకుపచ్చ రంగుని ఎంచుకుంది.అలాగే బ్రిటిష్ యూనిట్ చిహ్నాలు, ర్యాంక్ బ్యాడ్జ్‌లను తీసేసి జాతీయ చిహ్నాలతో భర్తీ చేశారు. ఇక పాక్ సైన్యం నెలవంకను ఎంచుకుంటే..భారత్ తమ సైన్యం కోసం అశోక చిహ్నాన్ని తీసుకుంది.

సైనిక సవాళ్లను అధిగమించడం కోసం..
1980లు–1990ల సమయంలో భారత సైన్యం చాలా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుండేది. ముఖ్యంగా ఈశాన్య జమ్యూ కశ్మీర్ వంటి క్లిష్ట భూభాగాలలో సైనికులు యూనిఫాం కనిపంచకుండా ఉండేలా చేయాలసి వచ్చేది. అందుకోసం 1980లలో ఆర్మీ మట్టితో కూడిన ఆకుపచ్చ రంగులను, గోధుమ రంగులను ప్రవేశ పెట్టింది. ఇవి సైనికులను అడవులు, కొండప్రాంతా ప్రకృతి దృశ్యాలలో కలిసిపోయేందు ఉపకరించింది.
2000ల ప్రారంభంలో మరింతగా మార్పులు చేశారు..
2000ల ప్రారంభం నాటికి, భారత సైన్యం PC DPM (డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ మెటీరియల్) యూనిఫామ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఫ్రెంచ్ సైన్యంలో ఉపయోగించిన నమూనాల నుంచి ప్రేరణ పొందింది. భారతీయ అవసరాలకు అనుగుణంగా, పిక్సెల్ లాంటి నమూనాతో ఆకర్షణీయమైన లుక్‌తో డిజైన్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో సహా సైనికుడు లుక్‌కి ఓ ప్రేరణగా నిలిచింది. అయితే ఇది అడవులు వంటి ఎత్తైన ప్రాంతాలలో బాగా పనిచేసినప్పటికీ..రాజస్థాన్ వంటి ఎడారి రాష్ట్రాల్లో ఇది సరైనది కాదని తేలింది.
2022: యూనిఫాంలో ఒక మైలురాయి మార్పు
ప్రస్తుతం భారత సైన్యం ధరిస్తున్న యూనిఫాం మార్పు 2022లో జరిగింది. ఆర్మీ దినోత్సవం నాడు భారత సైన్యం తన తాజా డిజిటల్ కామఫ్లాజ్ యూనిఫామ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. తేలికగా, గాలిని పీల్చుకునేలా త్వరగా ఆరిపోయే కాటన్-పాలిస్టర్ మిశ్రమంతో తీసుకొచ్చింది. ఇది ఆధునిక సైనిక అవసరాలకు అనువగా ఉండటమే గాక అడవుల నుంచి ఎడారుల వరకు అన్ని భారతీయ భూభాగాలను అనుగుణంగా ఏకరీతిలో ఉండేలా డిజైన్ చేశారు.
(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..)