సాక్షి,న్యూఢిల్లీ: భారత సరిహద్దులను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు.. భారత్ సర్కార్ తేజస్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో అస్త్రాలుగా మార్చింది. అయితే, ఈ తేజస్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
తేజస్ చరిత్రలో ముఖ్య ఘట్టాలు
1980లలో ప్రారంభం: మిగ్-21లను భర్తీ చేయడానికి స్వదేశీ ఫైటర్ జెట్ అభివృద్ధి ప్రణాళిక మొదలైంది.
1990లలో రూపకల్పన: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కలిసి రూపకల్పన చేశారు.
2001 జనవరి 4: టెక్నాలజీ డెమానిస్ట్రేట్ -1 మొదటి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది.
2015 జనవరి 17: అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రవేశించింది.
2021–2025: Mk1A వెర్షన్ అభివృద్ధి, అధునాతన ఎలక్ట్రానిక్స్, రాడార్, ఆయుధ వ్యవస్థలతో మరింత శక్తివంతంగా తయారు చేశారు.
తేజస్ లక్షణాలు
తరం: 4.5 జనరేషన్, మల్టీ-రోల్ ఫైటర్ జెట్.
డిజైన్: డెల్టా-వింగ్, సింగిల్ ఇంజిన్.
బరువు: గరిష్టంగా 13,300 కిలోలు టేకాఫ్ సమయంలో.
లోడ్ సామర్థ్యం: 4,000 కిలోల వరకు ఆయుధాలు మోసే సామర్థ్యం.
వేరియంట్లు
సింగిల్ సీట్ (ఫైటర్ వెర్షన్)
ట్విన్ సీట్ (ట్రైనర్ వెర్షన్)
నేవీ కోసం ప్రత్యేక వెర్షన్
ప్రాముఖ్యత
స్వదేశీ అభివృద్ధి: భారతదేశం స్వయంగా రూపొందించిన తొలి ఫైటర్ జెట్.
మిగ్-21లకు ప్రత్యామ్నాయం: పాత రష్యన్ విమానాలను భర్తీ చేస్తోంది.
ఎగుమతి అవకాశాలు: భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంది.
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్: దీని ద్వారా భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతలో పెద్ద అడుగు వేసింది.
తాజా పరిణామాలు
దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్ అయ్యింది. ఇది 24 ఏళ్ల చరిత్రలో రెండో ప్రమాదం. ఈ ఘటన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణ ప్రారంభించింది.


