భారత సైన్యానికి హీరో విజయ్ దేవరకొండ విరాళం | Vijay Devarakonda Donates Indian Army | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మంచి మనసు

May 9 2025 6:36 PM | Updated on May 9 2025 7:05 PM

Vijay Devarakonda Donates Indian Army

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత సైన్యానికి పలువురు విరాళాలు ఇస్తున్నారు. తన వంతు బాధ‍్యతగా ఇ‍ప్పుడు విజయ్ కూడా విరాళం ప్రకటించాడు.

(ఇదీ చదవండి: మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే) 

రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రమోషన్ అసలు చేస్తారా లేదా? సినిమా విడుదల కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) 

Advertisement
 
Advertisement
Advertisement